హైదరాబాద్‌లో నేటి నుండి జనవరి మొదటి వారం వరకు 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానా, వాహనాల సీజ్, జైలు శిక్ష, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసే వారిపై కూడా చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలను క్షేమంగా జరుపుకోవాలని సూచించారు.