నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. చేప మందు ప్రసాదం తీసుకొనేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సా. 6 గంటల వరకు 45,900 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇవాళ బత్తిన బ్రదర్స్ కవాడిగూడ, దూద్బౌలిలో తమ ఇళ్ల వద్ద రోగులకు మందు వేశారు