ఇరాన్‌లో
అమెరికా సైనిక చర్యలు తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను అధికంగానే కొనసాగించవచ్చనే అంచనాలతో మంగళవారం (మే 26) మార్కెట్లో బంగారం ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.6% క్షీణించి ఔన్సుకు $4,544.33 వద్ద ట్రేడవుతోంది. అయితే, భారతదేశంలో ఈరోజు (మంగళవారం, మే 26) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, డాలర్ విలువ తగ్గడం వంటి కారణాల వల్ల దేశీయంగా పసిడి రేట్లు సానుకూలంగా కదిలాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,46,110, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,59,390గా ఉంది.