తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చేసిన విమర్శలను టిపిసి అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందనడం విడ్డూరంగా ఉందని, ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, త్వరలోనే మరిన్ని ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. హామీలు ఇచ్చి మర్చిపోవడం బీఆర్‌ఎస్‌కు అలవాటని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం
కాంగ్రెస్ సంస్కృతి అని ఆయన విమర్శించారు.