హైదరాబాద్‌కు చెందిన యువ నాయకుడు మేకల వివేక్ యాదవ్‌ను భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఆదివారం నియమించారు. యువతలో ఆయనకున్న ఆదరణ, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్రను గుర్తించిన జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతను అప్పగించారు. పార్టీని తెలంగాణలో బలోపేతం చేసి యువత సమస్యలపై పోరాడతానని వివేక్ యాదవ్ తెలిపారు.