జులై 2న రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్

561చూసినవారు
ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమానికి సంబంధించిన పోస్టర్‌ను మాజీ స్పీకర్ మధుసూదనాచారి, సిపిఐ సీనియర్ నాయకులు అజీజ్ పాషా, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్