గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. ఉద్యమకారుల అరెస్ట్

0చూసినవారు
హైదరాబాద్‌లోని నాంపల్లి గాంధీ భవన్ వద్ద గురువారం తెలంగాణ ఉద్యమకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు భిక్షాటన చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఉద్యమకారులు ఆరోపించారు. గాంధీ భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.

సంబంధిత పోస్ట్