హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆయన సైకిలిస్టులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో సంప్రదాయ వస్త్రధారణతో ఉన్న హైదరాబాదు విమెన్ బైకర్స్ అందరినీ ఆకట్టుకున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగం కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.