హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ కూడలి వద్ద ప్రతిరోజూ ఏర్పడుతున్న భారీ ట్రాఫిక్ జామ్‌పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఖాజా మెన్షన్ వద్ద ట్రాఫిక్‌లో రెండు అంబులెన్స్‌లు చిక్కుకుపోవడంతో ప్రజల ఆగ్రహం మరింత పెరిగింది. వీఐపీలు తరచుగా వెళ్లే ఈ మార్గంలో అంబులెన్స్‌లు చిక్కుకోవడంపై, మనిషి ప్రాణం కంటే వీఐపీలను తొందరగా పంపించడం అంత ముఖ్యం కాదంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.