వికారాబాద్: 3 సెకన్లు కంపించిన భూమి.. భయంతో పరుగులు

57చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్ గ్రామాల్లో సుమారు మూడు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్