గండీడ్ మండల పరిధిలోని కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో శివాలయం దగ్గర మురుగునీరు చేరింది. గత 2 నెలలుగా దోమల బెడద ఎక్కువగా ఉందని, మురుగునీటితో కంపు వాసన వస్తోందని, గ్రామ ప్రజలు బుధవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాసనతో నరకయాతన అనుభవిస్తున్నామని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యల పరిష్కరించాలని కోరారు.