పరిగిలో బాలిక ఆత్మహత్య

67చూసినవారు
పరిగిలో బాలిక ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంగళవారం జరిగింది. పాలమాకుల కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల నవేంద్ర, ఇటీవల పాఠశాలకు వెళ్లనని ఇంటికి తిరిగొచ్చింది. ఈ విషయంపై తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం కుటుంబ సభ్యులు బంధువుల దినవారాలకు వెళ్లిన సమయంలో, ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్