ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

2చూసినవారు
ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమనూర్తిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తల్లి మమత, తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి, కూతురు జనశ్రీ మృతదేహం లభ్యం కాగా, కుమారుడు సాకేత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో సాకేత్ మృతదేహం ఇంకా లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాలు ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్