వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చెల్లాపూర్‌కు చెందిన గంధం అమృతమ్మ(34) దారుణ హత్యకు గురైంది. సెప్టెంబర్ 18న తల్లి ఇంటికి వెళ్తానని చెప్పి అదృశ్యమైన ఆమె కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో మంగలి ఆనంద్(28)పై అనుమానం రావడంతో, వెన్నచెడ్ శివారులోని చెరువు వద్ద అమృతమ్మను హత్య చేసి, డీజిల్ పోసి నిప్పంటించి, మృతదేహాన్ని సంచిలో వేసి బైక్‌పై తెలంగాణ-కర్ణాటక సరిహద్దు రాయచూర్ రూట్లోని చెట్ల పొదల్లో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సరిహద్దు ప్రాంతంలో అమృతమ్మ మృతదేహం లభించడంతో, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.