పరిగి మండలం రూప్ సింగ్ తండాలో బీమా డబ్బులు, ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన వివాదం తల్లి, కొడుకుల మృతికి దారితీసింది. నాతి బాయి మృతి చెందిన తర్వాత ఆమె బీమా డబ్బులు ఇవ్వాలని కుమారుడు అనార్ సింగ్ తండ్రి మోహన్ను కోరాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన అనార్ సింగ్, ఈ నెల 24న రాత్రి నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో గాయపడిన వెంకటేశ్ శనివారం మృతి చెందగా, కొడుకు అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే, ఆదివారం సర్పంచ్ రమణీ బాయి కూడా మృతి చెందింది. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.