గాజుల రామారం భూమిలో20ఎకరాలు స్పోర్ట్స్ గ్రౌండ్‌కుకేటాయించాలి

1చూసినవారు
గాజుల రామారం భూమిలో20ఎకరాలు స్పోర్ట్స్ గ్రౌండ్‌కుకేటాయించాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ ప్రజల ఆరోగ్యం కోసం గాజుల రామారం గ్రామ పరిధిలోని 317 ఎకరాల ప్రభుత్వ భూమిలో కనీసం 20 ఎకరాలను సమగ్ర క్రీడా ప్రాంగణంగా కేటాయించాలని స్థానికులు ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ఆకుల సతీష్, నల్లా జయశంకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజా అవసరాల కోసం భూమిని వినియోగించాలని కోరుతూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అరుణ్, ఈశ్వర్ రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్