ఒకే నంబర్ ప్లేట్ తో 3 స్కూటీలు.. ముగ్గురు అరెస్ట్

2చూసినవారు
ఒకే నంబర్ ప్లేట్ తో 3 స్కూటీలు.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్‌లో నంబర్ ప్లేట్లతో గారడీలు పెరిగిపోతున్నాయి. తాజాగా TS09 FE 4997 అనే ఒకే నంబర్ ప్లేట్ తో 3 హోండా యాక్టివాలను తిప్పుతున్న ముగ్గురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. చలానాలు, ఫైనాన్స్ బకాయిల నుంచి తప్పించుకోవడానికి వారు డూప్లికేట్ నంబర్ ప్లేట్లు వాడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై వారసిగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్