తాగిన మైకంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి.. ఒకరు మృతి

11చూసినవారు
తాగిన మైకంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి.. ఒకరు మృతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్ లో జగదీశ్వర్ రెడ్డి (26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మద్యం సేవించి, డబ్బుల విషయంలో గొడవపడటంతో సోహెల్ (20) అనే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగదీశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీరాలకు చెందినవాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు సోహెల్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
Job Suitcase

Jobs near you