శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ధ్వర్యంలో ఘనంగా నృత్య ప్రదర్శన

608చూసినవారు
శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ధ్వర్యంలో ఘనంగా నృత్య ప్రదర్శన
హైదరాబాద్, కుత్బుల్లాపూర్ లోని నిజాంపేట్ గ్రామపంచాయతీ సమీపంలో శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆదివారం నిర్వహించారు. చైతన్విక డాన్స్ అకాడమీ విద్యార్థులు, నృత్య గురువు సాయి ప్రియ శిక్షణలో అద్భుత ప్రదర్శనలతో అలరించారు. ప్రతి వినాయక చవితికి తమను ప్రోత్సహిస్తూ నృత్య ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారని సాయి ప్రియ తెలిపారు. చిన్నారుల్లో భారతీయ సాంప్రదాయ కళలపై ఆసక్తి పెంచుతూ, వారి ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్