కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ బహదూర్‌పల్లిలో జరిగిన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ఓటరు సవరణ కార్యక్రమంలో నకిలీ ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు కోసం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.