వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెనుముప్పు: రవి రాజ్ రాథోడ్

249చూసినవారు
వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెనుముప్పు: రవి రాజ్ రాథోడ్
పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెను ప్రమాదంగా పరిణమిస్తోందని ఎన్‌బీఎంఐ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానితో సహా అనేక మెట్రో నగరాలు కాలుష్యంతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని, ఇది ప్రజల ఆరోగ్యం, జీవన నాణ్యతను దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పేరిట చేపడుతున్న చర్యల వల్ల మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడితే, అది నిజమైన అభివృద్ధి కాదని, ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు సమిష్టిగా బాధ్యత తీసుకుంటేనే వాయు కాలుష్యాన్ని నియంత్రించగలమని ఆయన పిలుపునిచ్చారు.