దూలపల్లిలో పంచాయతీ రోడ్డుపై కబ్జా ఆరోపణలు.. అధికారుల మౌనం?

5చూసినవారు
దూలపల్లిలో పంచాయతీ రోడ్డుపై కబ్జా ఆరోపణలు.. అధికారుల మౌనం?
దూలపల్లి 154, 157 సర్వే నంబర్లలో గ్రామపంచాయతీ కాలం నాటి లేఅవుట్ రోడ్డును కొందరు ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ నిధులతో గతంలో ఈ రహదారిపై బీటీ రోడ్డు నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం పాత రహదారి పరిధిలో ప్రహరీలతో పాటు షెడ్ నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. రాజకీయ, అధికారుల అండదండలతో లేఅవుట్‌లో మార్పులు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, CMC అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి రహదారి హద్దులు నిర్ధారించి, ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్