పేదల అత్యవసర సేవలకు అంబులెన్స్ ప్రారంభం

241చూసినవారు
పేదల అత్యవసర సేవలకు అంబులెన్స్ ప్రారంభం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సోమయ్య నగర్‌లోని నల్ల పోచమ్మ దేవాలయం సమీపంలో "చిల్డ్రన్ కేర్ చారిటబుల్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నూతన అంబులెన్స్ సేవలను బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేలా అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ నరేందర్, మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, మాజీ దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్