ప్రగతి నగర్‌లో స్కూల్ భూమిపై ఆక్రమణ యత్నం – స్థానికుల నిరసన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతి నగర్‌లోని ప్రభుత్వ హైస్కూల్ భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు రెండు ఎకరాల పాఠశాల స్థలాన్ని పార్క్ లేదా ప్రైవేట్ స్థలంగా పేర్కొంటూ దేవాలయ నిర్మాణానికి యత్నాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. విద్యార్థుల హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన చెందిన స్థానికులు పాఠశాల ప్రాంగణం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆక్రమణ యత్నాలను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
