నాసిరకం నిర్మాణాల బండారం బట్టబయలు చేసిన బీజేపీ

4చూసినవారు
నాసిరకం నిర్మాణాల బండారం బట్టబయలు చేసిన బీజేపీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్, గాగిల్లాపూర్ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నాణ్యతపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆకస్మికంగా పరిశీలన నిర్వహించారు. దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన, జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు డా. ఎస్. మల్లారెడ్డి, సర్కిల్‌లోని మూడు డివిజన్ల బీజేపీ నాయకులు కలిసి నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు. నిర్మాణంలో ఇసుకను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కుప్పలు పోసి, వాస్తవ వినియోగంలో మాత్రం డస్ట్ వాడుతున్నారని వచ్చిన సమాచారంతో పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్