కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ గండిమైసమ్మ మండలం బౌరంపేటలో ప్రభుత్వ భూమి వివాదంపై గౌరవ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే నెం. 166/9/2లో ఉన్న సుమారు 4 ఎకరాలు 38 గుంటల భూమికి సంబంధించిన అక్రమ సబ్‌డివిజన్, రెవెన్యూ రికార్డుల మార్పులపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణ వరకు యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. సంబంధిత అధికారుల చర్యలపై ప్రశ్నలు లేవనెత్తిన కోర్టు, ప్రైవేట్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం భూమిపై ఎలాంటి కొత్త మార్పులు, రిజిస్ట్రేషన్లు లేదా రికార్డు సవరణలు చేయరాదు.