బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

3చూసినవారు
బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ పైప్లైన్ రోడ్డులో రూ.56 కోట్లతో చేపడుతున్న నూతన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని, దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. నిర్మాణ పనులను ఎటువంటి అసౌకర్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్