కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సరదాగా చాయ్ తాగడానికి వెళ్లిన ఇద్దరు సోదరులకు రెండున్నర తులాల బంగారు గొలుసు దొరికింది. ఈ ఘటన ఆదివారం గండి మైసమ్మలో జరిగింది. నవీన్ కుమార్, అనిల్ కుమార్ అనే సోదరులు పిస్తా హౌస్ లో చాయ్ తాగుతుండగా వారికి ఈ బంగారు గొలుసు లభించింది. అనంతరం, వారు మారేపల్లి సుధాకర్ తో కలిసి ఎస్ఐ రంజిత్ రెడ్డికి ఆ బంగారు గొలుసును అప్పగించారు.