పోచంపల్లి–ఇందిరానగర్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

1చూసినవారు
పోచంపల్లి–ఇందిరానగర్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహదూర్ పల్లి డివిజన్ పరిధిలోని డి. పోచంపల్లి గ్రామం, ఇందిరానగర్ కాలనీ, చంద్రశేఖర్ రెడ్డి కాలనీలలో పార్టీ జెండాను మాజీ కౌన్సిలర్ బండారి మహేందర్ యాదవ్ ఆవిష్కరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కొల్తూరి మల్లేష్, వేణు గౌడ్, రాజశేఖర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్