సూరారం ఠాణా పరిధిలోని సాయిబాబానగర్ కూడలి వద్ద ఆదివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. జీడిమెట్ల నుంచి సూరారం వైపు వస్తున్న కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చేపల దుకాణం మీదుగా బిర్యానీ సెంటర్‌లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడితో పాటు అతడి తల్లి, ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.