ప్రభుత్వ భూమి ఆక్రమణపై కేసు నమోదు

0చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం గ్రామంలో సర్వే నెం. 79లో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి నిర్మాణం చేపట్టిన నెహ్రూ నగర్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్‌పై కేసు నమోదైంది. అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించి, బెదిరింపులకు పాల్పడినట్లు మండల రెవెన్యూ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 132, 226 నుంచి 329 కింద క్రైమ్ నెం. 558/2026 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్