కొంపల్లి సర్కిల్ లో చక్రం తిప్పుతున్న చైన్‌మెన్లు?

1559చూసినవారు
కొంపల్లి సర్కిల్ లో చక్రం తిప్పుతున్న చైన్‌మెన్లు?
కొంపల్లి సర్కిల్‌ సుభాష్‌నగర్, 290వ డివిజన్‌ రాంరెడ్డి నగర్లో భారీ అక్రమ షెడ్‌పై ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు లేవన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నిర్మాణానికి కొందరు బడా వ్యక్తుల అండదండలు ఉన్నాయని, కొందరు చైన్‌మెన్లతో కుమ్మక్కు కావడం వల్లే చర్యలు నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, షెడ్‌కు అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్