ప్రగతి నగర్‌లో సిఐటియు బ్లాక్ డే నిరసన

1చూసినవారు
ప్రగతి నగర్‌లో సిఐటియు బ్లాక్ డే నిరసన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి నగర్‌లో బ్లాక్ డేగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మికుల హక్కులు దెబ్బతింటాయని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్