కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సర్కిల్, బౌరంపేట్ డివిజన్‌లోని సింహపురి కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాలనీ వాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, గత నెలలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎంపీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, హైమాస్ట్ లైట్లు, బోర్‌వెల్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంపీ లాడ్స్ నిధులతో సింహపురి కాలనీలో రెండు హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు, ఒక బోర్‌వెల్ తవ్వకానికి నేడు మార్కింగ్ కార్యక్రమం జరిగింది.