కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ పరిధి సుభాష్ నగర్ డివిజన్ భవాని నగర్ కాలనీలో నెలలుగా నిలిచిపోయిన యూజీడీ, సీసీ రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. పనులు ఆగిపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనుల ఆలస్యానికి కారణాలను వెల్లడించి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నల్ల జై శంకర్ గౌడ్, పులి బలరాం, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.