కొంపల్లిలో గోమాత రక్షణకు భక్తుల పూజ, మున్సిపల్ కమిషనర్‌కు వినతి

262చూసినవారు
హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లి జయభేరి పార్క్ లోని శ్రీ అన్నపూర్ణ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం, 27 ఏప్రిల్ 2026న గోమాత రక్షణ, గోసంరక్షణ కార్యక్రమంలో భాగంగా గోమాత పూజ నిర్వహించారు. నంది చౌక్ వద్ద నంది విగ్రహానికి అభిషేకం చేశారు. గోమాత రక్షణ గురించి కొంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ ముఖ్య నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్