చెంగిచర్ల డిపో ప్రయాణికుల సమస్యలకు 'డయల్ యువర్ డీఎం'

353చూసినవారు
చెంగిచర్ల డిపో ప్రయాణికుల సమస్యలకు 'డయల్ యువర్ డీఎం'
చెంగిచర్ల డిపో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి డిపో మేనేజర్ ఎస్.స్వాతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బస్సు రాకపోకలు, సర్వీసుల కొరత, సమయపాలన, సిబ్బంది ప్రవర్తన వంటి అంశాలపై ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సూచనలు, అభిప్రాయాలను నేరుగా 7893088433 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమం హైదరాబాద్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రయాణికులకు ఉపయోగపడుతుంది.

సంబంధిత పోస్ట్