ఇందిరమ్మ చీరల పంపిణీ

267చూసినవారు
ఇందిరమ్మ చీరల పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్ పరిధిలోని రోడమేస్త్రి డివిజన్‌లో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను మేడ్చల్ డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్