కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట పోస్టాఫీస్‌లో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రజా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పీవో నార్త్ సూపరింటెండెంట్ సంపత్ రెడ్డి, బౌరంపేట పోస్టాఫీసర్ బైండ్ల ఎల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన
బీజేపీ డివిజన్ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి, పోస్టాఫీస్ ద్వారా అందిస్తున్న సేవింగ్స్ అకౌంట్లు, బీమా, పెన్షన్, సుకన్య యోజన వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం పోస్టాఫీస్ సేవలను వినియోగించుకుని భవిష్యత్ భద్రతను కల్పించుకోవాలని ఆయన సూచించారు.