హైదరాబాద్‌లోని గ్రీన్ హిల్స్ కాలనీ, బహదూర్ పల్లిలో శ్రీదుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దుర్గాష్టమి సందర్భంగా, శ్రీ మహాదుర్గాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ సుబ్రహ్మణ్య సేవా సమితి సొసైటీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు మిరియాల మూర్తి గారు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.