మౌలిక వసతుల లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈటల రాజేందర్

1చూసినవారు
మౌలిక వసతుల లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈటల రాజేందర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సర్కిల్ పరిధిలోని డబుల్ బెడ్‌రూం కాలనీల్లో నెలకొన్న సమస్యలను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దుండిగల్, గండి మైసమ్మ, బహదూర్ పల్లి ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక వసతుల లోపం, ఇళ్ల నాణ్యత, నీటి కొరత, మురుగు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మిషన్ భగీరథ నీటిని తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్