ఫ్యాబ్రిక్ షెడ్‌లో మంటలు – సమయానికి స్పందించిన ఫైర్ సిబ్బంది

3చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల సాయి సత్య ఫ్యాబ్రిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి షెడ్‌ను కమ్మేశాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :