గ్రేటర్‌లో తొలి గెలుపుకుత్బుల్లాపూర్నుంచే: రామ్ తాల్లూరి ధీమా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తొలి విజయాన్ని నమోదు చేస్తుందని రామ్ తాల్లూరి ధీమా వ్యక్తం చేశారు. రుంకు సాయి కృష్ణ ఆధ్వర్యంలో సూరారం గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా 292వ డివిజన్ సాయిబాబా నగర్‌లో నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని రామ్ తాల్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ నందగిరి సతీష్ సారథ్యంలో కట్టమైసమ్మగుడి నుంచి సూరారం కాలనీ బస్‌స్టాప్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయిబాబా నగర్ బ్రాహ్మణబస్తీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
