కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జగద్గిరిగుట్ట మాజీ కార్పొరేటర్ కొలుకుల
జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం మగ్దమ్ నగర్‌లోని ఆయన కార్యాలయం వద్ద జీఎల్‌ఆర్‌ఏ
ఇండియా ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి వైద్య బృందంతో కలిసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు నొప్పులు, గొంతు సమస్యలకు ఉచిత మందులు పంపిణీ చేశారు. బస్తీ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలు నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సంజయ్ కుమార్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.