కొంపల్లిలో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈటల రాజేందర్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి, సమాజ ఆరోగ్యానికి, పరిశుభ్రతకు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ప్రధాని
మోదీ పిలుపు మేరకు కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ
భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా. ఎస్. మల్లారెడ్డి, మూగ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.