కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాలయ్య నగర్ బస్తిలో అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణతో ప్రజలు భయాందోళనల్లో జీవిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు జరుగుతుండటంతో స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. "ఇంట్లో ఉన్నా భయం… బయటికి వెళ్లినా భయం… మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?" అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ మద్యం విక్రయాలు పెరిగిపోవడం ప్రజల ప్రశాంతతను దెబ్బతీస్తోంది.