పెళ్లికాలేదు నిన్నే చేసుకుంటా అని నమ్మించి యువతి (21)ని గర్భవతిని చేసి మొహం చాటేశాడో కామాంధుడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా కటకటాల పాలయ్యాడు. సీఐ ఉపేందర్ మాటల్లో. ఇల్లెందుకు చెందిన బి. ఏసుదాస్ డేవిడ్ (43) మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నాను అంటూ మల్లంపేటలోని హోటళ్లకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేగా మొహం చాటేశాడు.