కుత్బుల్లాపూర్‌లో హోళీ సంబురాలు

4చూసినవారు
కుత్బుల్లాపూర్‌లో హోళీ సంబురాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పద్మనగర్ ఫేజ్–2, రోడ్ నెం. 22లో ఉన్న వాగ్దేవి రెసిడెన్సి అపార్ట్మెంట్‌లో హోళీ పండుగను చిన్నారులు ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల గులాల్, పిచ్కారీలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో మురిసిపోయారు. అపార్ట్మెంట్ ప్రాంగణం అంతా రంగుల హర్షధ్వనులతో మార్మోగింది. పెద్దలు కూడా పిల్లలతో కలిసి సంబరాల్లో పాల్గొని పండుగకు మరింత ఉత్సాహం తీసుకొచ్చారు. నిర్వాహకుల సూచన మేరకు సహజ రంగులతోనే హోళీ ఆడటంతో, పండుగ పర్యావరణహితంగా జరిగింది.

సంబంధిత పోస్ట్