అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

3చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కమాన్ సమీపంలో గత రాత్రి రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారికి ఇరువైపులా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన తాత్కాలిక దుకాణాలు కావడంతో బీమా సదుపాయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు పక్కన షాపులు ఏర్పాటు చేసే ముందు యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలపై ఆలోచించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :