ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదమా..?

1చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ-2లో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో ఉన్న ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్